కలం, సినిమా: దసరా పండుగ వేళ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ ఫ్యాన్స్కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ‘స్పిరిట్’ (Spirit Movie) నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేయడంతో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. 2027లో అక్టోబర్ 29న దీపావళి కానుకగా చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. క్యాప్ పెట్టుకుని ప్రభాస్ కనిపిస్తున్న స్టిల్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. గతంలో సినిమా అనౌన్స్ చేసినప్పుడు విడుదల చేసిన ప్రభాస్ పోస్టర్ తెగ ఆకట్టుకుంది. తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేసి.. విడుదల తేదీని కూడా చెప్పేశారు. ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రీ నటిస్తోంది.
సంవత్సరం ఆగాల్సిందేనా..?
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ‘స్పిరిట్’ మూవీ గురించి ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోందని.. మరో రెండు నెలల్లో కంప్లీట్ అవుతుందని ఇండస్ట్రీలో చర్చ జరిగింది. 2027 వేసవిలోపే విడుదలవుతుందని అంతా భావించినా.. సందీప్ రెడ్డి వంగా వచ్చే దీపావళికి అని ప్రకటించేశారు. అంటే ఇంకో ఏడాది వరకు ఆగాల్సిందేనా.. అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే వారిని నిరుత్సాహపర్చకుండా.. సందీప్ రెడ్డి వంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

