గంభీర్‌పూర్‌లో రైతుల రాస్తారోకో

కలం, మెదక్ బ్యూరో: వ్యవసాయానికి ప్రభుత్వం నుంచి సరిపడా విద్యుత్ సరఫరా కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్‌పూర్ (Gambheerpur) వద్ద రైతులు రోడ్డుపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. వరి పంట ప్రస్తుతం పొట్టదశకు చేరుకుందని, ఈ కీలక సమయంలో పంటకు సరిపడా నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయానికి విద్యుత్ ఇవ్వకపోవడం వల్ల బోరు బావుల ద్వారా నీటిని పారించలేకపోతున్నామని, పంట చేతికి వచ్చే సమయంలో ఎండుతుంటే తమ పరిస్థితి ఏమిట‌ని వారు ఆందోళన వ్య‌క్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి విద్యుత్ అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయానికి వెంటనే సక్రమంగా, తగినంత విద్యుత్ సరఫరా చేయాలని, పంటలను ఎండిపోకుండా కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>