సీఎం రేవంత్‌కు టీఎస్ యూటీఎఫ్ పోస్ట్ కార్డుల నిరసన!

కలం, ఖమ్మం బ్యూరో : కేజీబీవీ, యుఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ టీఎస్ యూటీఎఫ్ (TSUTF) ఆధ్వర్యంలో శనివారం సీఎం ఏనుముల రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డుల వినతి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏన్కూర్ (Enkuru) మండల కేంద్రంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాన్ని టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు బి.రామ్ చంద్, ప్రధాన కార్యదర్శి మూడ్ పుల్లయ్య ప్రారంభించి, ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డులు పంపించారు.

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… దశాబ్దాలుగా తీవ్ర శ్రమదోపిడీకి గురవుతున్న కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీసులను గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. క్రమబద్ధీకరణతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్ కార్డులు, సాధారణ సెలవులు ఇవ్వాలని, కేజీబీవీలలో కేర్ టేకర్లను నియమించాలని కోరారు. అలాగే గతంలో చేపట్టిన సమ్మె కాలానికి సంబంధించిన 29 రోజుల వేతనాన్ని వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారానైనా ప్రభుత్వంలో కదలిక రావాలని, లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, కేజీబీవీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>