ఎగిరే కార్లు రెడీ.. ఎలన్ మస్క్ సంచలనం!

కలం, వెబ్ డెస్క్: టెస్లా అధినేత ఎలన్ మస్క్ (Elon Musk) మరోసారి సంచలనం సృష్టించారు. గాల్లో ఎగిరే కారు (Flying Car)ని ఆవిష్కరించిన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న స్పేస్ ఎక్స్ సెంటర్‌లో ర్యాంప్‌పై తలకిందులుగా వెళ్తూ.. గాల్లోకి ఎగురుతున్న ఫ్లయింగ్ టెస్లా కారుని తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. నెట్టింట తెగ వైరలవుతోంది. గాల్లోకి ఎగిరి సురక్షితంగా ల్యాండ్ అయింది. ‘భవిష్యత్తులో ఎగిరే కార్లు రాబోతున్నాయి’ అంటూ ఎలన్ మస్క్ పేర్కొన్నారు. కొంత కాలంగా ఎగిరే కార్ల గురించి ఎప్పటికప్పుడు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంటూ వస్తున్న.. అన్నట్లుగానే మొట్టమొదటి రోడ్‌స్టర్ కారును ఆవిష్కరించారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మాత్రం మరికొంత కాలం పట్టే అవకాశం ఉంది.

ప్రత్యేకతలు ఇవే..

ఎగిరే కారుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. దీనిలో ఎలన్ మస్క్ సొంత కంపెనీ స్పేస్ ఎక్స్ (SpaceX) టెక్నాలజీనే వాడారు. సాధారణంగా కార్లలో ఆయిల్ కాలడం వలన శక్తి ఏర్పడి.. వాహనం ముందుకు సాగుతుంటుంది. ఎగిరే కార్లలో (Flying Car) మాత్రం అధిక పీడనంతో నిల్వ చేసిన వాయువును బయటకు వేగంగా వదలడం ద్వారా పైకి ఎగురుతుంది. ఈ టెక్నాలజీనే కారు ఫ్లై అవడంతో పాటు ఎంత సేపు ఉండాలో కూడా నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికి ఇది మ్యాన్‌ఫ్యాక్చరింగ్ దశలోనే ఉంది. 2028 చివర్లో మాత్రమే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రోడ్డు భద్రతా నిబంధనలు, ఎగిరే సామర్థ్యం, ట్రాఫిక్ సమస్యలు.. ఇలా చాలా అంశాలను దాటి టెస్లా కారు ఎగరాల్సి ఉంటుంది. అందుకు చాలా సమయమే పట్టే అవకాశం ఉంది.

Also Read : తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన.. ‘గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’కు పవన్ కళ్యాణ్ శ్రీకారం!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>