Mobile Popup Ad
Mobile Popup Ad

ఇజ్రాయెల్ కాదు.. నిర్ణయాలు నావే : ట్రంప్

కలం, వెబ్ డెస్క్ : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ ఆసియా వ్యవహారాల్లో తుది నిర్ణయం తనదేనని, ఇజ్రాయెల్ కాదని ఆయన స్పష్టం చేశారు. ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తానే అన్ని విషయాలను నిర్ణయిస్తానని, నెతన్యాహు ఏమీ నిర్ణయించలేరని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ తో కుదుర్చుకునే శాంతి ఒప్పందాన్ని నెతన్యాహు కచ్చితంగా అంగీకరించి తీరాలని, దీనికి ఆయనకు వేరే ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో తానే పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉన్నానని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ తన బృందంతో కలిసి న్యూజెర్సీలో కీలక చర్చలు జరుపుతున్నారు. ఈ వారంలోనే ఒక శాంతి ఒప్పందాన్ని తీసుకురావాలని ఆయన భావిస్తున్నట్లు ఫాక్స్ న్యూస్ పేర్కొంది.

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..

ఉత్తర ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తీవ్రంగా స్పందించింది. పశ్చిమ, మధ్య ఇరాన్ ప్రాంతాల్లోని పలు లక్ష్యాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. ఈ దాడుల ధాటికి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు తబ్రిజ్, ఇస్ఫహాన్ వంటి ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఒకవైపు ఇరాన్‌తో కుదుర్చుకోవాల్సిన ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో, ఈ తాజా క్షిపణి దాడుల పరంపర ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రం చేసేలా కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>