‘మీరు జెన్-జీ కాదు’.. సీజేపీ నేతలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​ : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చోటుచేసుకున్న ఘటనల్లో తమ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపును సవాల్ చేస్తూ సీజేపీ (CJP) నాయకులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) విచారణ జరిపింది. విచారణ సందర్భంగా పిటిషనర్ల వయసు ప్రస్తావనకు రాగా, సౌరవ్ దాస్ వయసు 27 ఏళ్లు, ఆశుతోష్ రంకా వయసు 32 ఏళ్లని వారి తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం, ఆశుతోష్ రంకా వయసును ఉద్దేశించి “మీరేం జెన్-జీ కాదు” అని వ్యాఖ్యానించింది. సాధారణంగా 1997 తర్వాత జన్మించిన వారిని మాత్రమే జెన్-జీ అని అంటారని న్యాయస్థానం స్పష్టం చేసింది.

అంతేకాకుండా, జంతర్ మంతర్‌ను నిరసనల వేదిక జాబితా నుంచి డీనోటిఫై చేశాక కూడా అక్కడికి ఎందుకు వెళ్లారని, శాంతి బాండ్ సమర్పించిన తర్వాత కూడా బ్యారికేడ్లను దాటాల్సిన అవసరం ఏమొచ్చిందని పిటిషనర్లను కోర్టు నిలదీసింది. విద్యార్థులు బ్యారికేడ్లను తొలగిస్తే, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని జాతి వ్యతిరేక శక్తులు చొరబడి తీవ్ర విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తగిన దిగువ న్యాయస్థానాలను ఆశ్రయించకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించడంపై ప్రశ్నలు లేవనెత్తడంతో పిటిషనర్లు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>