వైభవ్‌ వస్తే కష్టమే.. సాంట్నర్‌ వార్నింగ్!

కలం, స్పోర్ట్స్ : భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీని (Vaibhav Suryavanshi) ఎదుర్కొనేందుకు న్యూజిలాండ్‌ ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు ఆ జట్టు కెప్టెన్‌ మిచెల్‌ శాంట్నర్‌ (Mitchell Santner) ఈ విషయాన్ని వెల్లడించారు. వైభవ్‌కు తుది జట్టులో అవకాశం వస్తే అతడిని కట్టడి చేయడం సవాలుగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వెస్టిండీస్‌తో జరిగిన గత టీ20 సిరీస్‌లో వైభవ్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. ప్రస్తుతం అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ వంటి ఓపెనర్లు రాణిస్తుండటంతో జట్టులో పోటీ తీవ్రంగా ఉంది. దీంతో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో వైభవ్‌ ఆడతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే, వైభవ్‌ ప్రతిభపై తమకు స్పష్టమైన అవగాహన ఉందని శాంట్నర్‌ తెలిపారు. ఐపీఎల్‌లో అతడి దూకుడైన బ్యాటింగ్‌ను గమనించినట్లు చెప్పారు. అవకాశం దక్కితే వైభవ్‌ భారత జట్టుకు భవిష్యత్తులో కీలక ఆటగాడిగా మారగలడని అభిప్రాయపడ్డారు. వైభవ్‌ ఆడితే అతడిని ఎదుర్కొనేందుకు తమ జట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకుందని శాంట్నర్‌ వెల్లడించారు. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ తొలి పోరు గురువారం, అక్టోబర్‌ 22న ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో వైభవ్‌కు అవకాశం దక్కుతుందా లేదా అన్నది భారత జట్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>