Mobile Popup Ad
Mobile Popup Ad

భూ వివాదం.. కాంగ్రెస్ నేత హత్య

కలం, మెదక్ బ్యూరో: భూ వివాదాలు హత్యలకు దారితీస్తున్నాయి. సెంటు భూమి కోసం అయినవారినే కడతేరుస్తున్న ఘటనలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. పొలం గట్ల దగ్గర మొదలైన చిన్నపాటి ఘర్షణలు చివరకు దాడులు హత్యలకు దారితీస్తున్నాయి. పెరుగుతున్న భూముల ధరలు, సరిహద్దుల వివాదాలు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. రోజురోజుకూ భూ తాగాదాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో సిద్దిపేట (Siddipet)  జిల్లాలో జరిగిన కాంగ్రెస్ నేత హత్య కలకలం రేపుతోంది. జిల్లాలోని దుబ్బాకలో (మం) రాజక్కపేట గ్రామ శివారులో కాంగ్రెస్ (Congress) నాయకుడు దారుణ హత్య గురయ్యాడు. భూ వివాదం కారణంగా బాల్ రెడ్డి(50) హత్యకు గురైనట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>