సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్

కలం ,మహబూబ్ నగర్ బ్యూరో : జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta ) అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ మేరకు ఆసుపత్రి ఆవరణలో ఉన్న జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయాన్ని అనువైన వేరే భవనం లోకి షిఫ్టింగ్ పై కలెక్టర్ చర్చించారు. ప్రభుత్వ ఆదేశాల ననుసరించి సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు.

డాకర్ల, విద్యార్థుల, రోగుల పార్కింగ్ కు,పక్కన గార్డెనింగ్,మెయిన్ రోడ్డు నుండి అప్రోచ్ రోడ్డు తదితర పెండింగ్ పనులు పూర్తి చేసి రెండు నెలల్లో ఆసుపత్రి ప్రారంభంకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరిండెంట్ డా.రంగా అజ్మీరా, తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ డి.ఈ.ఈ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>