లండన్‌లో ఒకే వేదికపై తమిళ​ సూపర్​ స్టార్స్​

కలం, వెబ్ డెస్క్​ : లండన్ వేదికగా ఒక అరుదైన, అభిమానులను అలరించే సంఘటన చోటుచేసుకుంది. తమిళ సినీ రంగంలో అగ్ర కథానాయకులుగా వెలుగొందుతున్న విజయ్, అజిత్ (Vijay Ajith) లండన్‌లో కలుసుకున్నారు. వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

సీఎం విజయ్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. మరోవైపు కార్ రేసింగ్ పోటీల్లో బిజీగా ఉన్న అజిత్, అక్కడ ప్రతిష్ఠాత్మక లీ మాన్స్ రేసింగ్ ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంలో అజిత్ పాల్గొంటున్న లీ మాన్స్ రేసింగ్‌కు విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దాదాపు 34 సంవత్సరాల సినీ అనుబంధం ఉన్న ఈ ఇద్దరు దిగ్గజాలు మైదానంలో ఆత్మీయంగా కౌగిలించుకుని పలకరించుకున్నారు. కార్ రేసింగ్‌లో పాల్గొంటున్న అజిత్‌కు సీఎం విజయ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రిటన్‌లో అత్యంత వైభవంగా ప్రారంభమైన ఈ లీ మాన్స్ రేసింగ్ టోర్నీలో భారత రేసర్లను ప్రోత్సహించేందుకు విజయ్ అక్కడకు చేరుకున్నారు. ఇరువురి కలయికకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>