విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం!

కలం, వెబ్ డెస్క్​ : విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం షికారుగంజి జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Vizianagaram Road Accident) చోటుచేసుకుంది. మానాపురం నుంచి రామభద్రపురం వైపు ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా అతివేగంతో వచ్చిన లోడ్ లారీ ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాద ధాటికి ఆటో నుజ్జునుజ్జయి డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మృతుల్లో ఇద్దరిని బాడంగి మండలం గజరాయనివలస నివాసులుగా, మరొకరిని పెదమానాపురం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>