Mobile Popup Ad
Mobile Popup Ad

లోక్‌స‌భ‌లో వీగిన మ‌హిళా బిల్లు.. సీఎం రేవంత్ షాకింగ్ రియాక్ష‌న్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: లోక్‌స‌భ‌లో కేంద్రం ప్ర‌వేశ పెట్టిన మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు వీగిపోవ‌డంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎక్స్ వేదిక‌గా స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇది చిర‌స్థాయిగా నిలిచిపోయే మ‌రుపురాని రోజు అని సీఎం అన్నారు. లోక్‌సభ విప‌క్ష నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ప్రజాస్వామ్య శక్తులు, ప్రతిపక్ష నాయకులు అంతా ఏకమై ఒక జాతీయ విపత్తును నివారించార‌ని పేర్కొన్నారు. మిత్ర‌ప‌క్షాల‌న్నీ నల్ల బిల్లుల‌ను ఓడించేందుకు కఠిన పరిస్థితుల్లోనూ ఐక‌మ‌త్యంతో, సాహసంతో నిలిచాయ‌ని కొనియాడారు. ఈ సంద‌ర్భంగా ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధ‌వ్ ఠాక్రే, లాలు ప్రసాద్ యాదవ్, హేమంత్ సోరెన్, ఫరూఖ్ అబ్దుల్లా, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్, అలాగే కమ్యూనిస్ట్ పార్టీల నాయకుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>