మేడారంలో సమ్మక్క–సారలమ్మకు సీఎం ప్రత్యేక పూజలు

క‌లం, మేడారం: సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం మేడారం చేరుకున్నారు. వనదేవతలు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ‌వార్ల‌కు ఎత్తు బంగారం స‌మ‌ర్పించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం మేడారం(Medaram)లోనే ఒంటరి మహిళలకు సీఎం పింఛన్లు అందజేశారు. సీఎం పర్యటన సందర్భంగా ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు, స్థానికులు తరలివచ్చారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీఎం ప‌ర్య‌ట‌న‌లో మంత్రి సీత‌క్క (Minister Seethakka) కూడా ఉన్నారు. రానున్న రాఖీ పౌర్ణ‌మిని పుర‌స్క‌రించుకొని సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) సమ్మక్క గద్దె వద్ద మంత్రి సీత‌క్క‌ రాఖీ కట్టారు. ప్ర‌తి ఏటా రాఖీ పండుగ‌కు రేవంత్ రెడ్డికి సీత‌క్క రాఖీ క‌డ‌తారు. అయితే ఏడాది రాఖీ పౌర్ణ‌మి స‌మ‌యంలో సీఎం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉండే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ముంద‌స్తుగా రాఖీ క‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. అనంత‌రం సీఎం స్థానిక మహిళలతో కరచాలనం చేసి ముచ్చటించారు. సీఎం మేడారం పర్యటనలో దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ క‌నిపించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Also Read : ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చరిత్ర.. సంచలన విజయం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>