హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో విపత్తు నిర్వహణ, ప్రజా ఆస్తుల రక్షణ, పట్టణ నియంత్రణ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడానికి ఏర్పాటైన హైడ్రా (HYDRAA) సంస్థపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో జరుగుతున్న ‘ది హింద్ హడిల్ 2026’ లైవ్ సెషన్ చర్చలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).. ఆ సంస్థకు ‘హైడ్రా’ అనే పేరు పెట్టడంపై కారణాలు వివరించారు. ‘హైడ్రా’ అనే పేరు హిట్లర్‌కు చాలా ఇష్టమని, హిట్లర్ దగ్గర ఉన్న హంతక ముఠా పేరు ‘హైడ్రా’ అని వెల్లడించారు. హైదరాబాద్‌లో చెరువులను ఎవరు ఆక్రమించాలనుకున్నా, అక్రమ కట్టడాలు చేపట్టాలనుకున్నా భయపడాలనే ఉద్దేశంతోనే ‘హైడ్రా’ అనే పేరు పెట్టినట్లు స్పష్టం చేశారు.

అంతేకాదు హైడ్రా (HYDRAA) పనితీరును సమర్థిస్తూ, విమర్శలు చేస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. “పేదవాళ్లు చెరువుల పరిసరాలను ఆక్రమించుకుంటే అర్థం చేసుకోవచ్చు, కానీ పెద్దవాళ్లు కూడా చెరువులను కబ్జా చేస్తే ఎలా?” అని ప్రశ్నించారు. ‘హైడ్రా’ వచ్చాక ప్రస్తుతం ఎవరైనా చెరువును కబ్జా చేయడానికి కనీసం ఆలోచన చేస్తారా? అని నిలదీసిన సీఎం.. మెట్రోపాలిటన్ వంటి నగరాలకు ‘హైడ్రా’ వ్యవస్థ అవసరముందని చెప్పుకొచ్చారు.

Read Also: రేవంత్ పర్యటనతో పాలమూరుకు ఒరిగింది శూన్యం: బీఆర్ఎస్ నేతలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>