ప్రభుత్వ సొమ్మును రోశయ్య పొదుపుగా వాడేవారు : సీఎం రేవంత్

కలం, స్పోర్ట్స్ : ఉప్పల్‌ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులను ఉద్దేశించి ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ హయాంలో ఆర్థిక శాఖను ఆర్యవైశ్యులకే అప్పగించే సంప్రదాయం ఉండేదని ఆయన గుర్తుచేశారు.

‘‘కాంగ్రెస్‌ హయాంలో గల్లాపెట్టె వ్యవహారం ఆర్యవైశ్యులకే ఇచ్చాం. సీఎం ఎవరైనా ఆర్యవైశ్యులకే ఆర్థిక శాఖ ఉండేది’’ అని సీఎం వెల్లడించారు. ప్రభుత్వ సొమ్మును మాజీ సీఎం కొణిజేటి రోశయ్య ఎంతో పొదుపుగా వినియోగించేవారని చెప్పారు. రోశయ్య సేవలను గుర్తించిన కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు పలు కీలక పదవులు అప్పగించిందన్నారు.

నన్ను మొదట గుర్తించింది రోశయ్యే : సీఎం

తన రాజకీయ జీవితంలో రోశయ్య ఇచ్చిన ప్రోత్సాహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన ఇంట్లో వాళ్ల కంటే ముందే నన్ను గుర్తించింది పెద్దలు రోశయ్య అని చెప్పారు. 2007లో తాను తొలిసారి శాసనమండలికి వెళ్లిన సమయంలో జరిగిన సంఘటనను సీఎం (CM Revanth Reddy) గుర్తుచేసుకున్నారు. శాసనమండలిలో కొన్ని అంశాలపై తాను దూకుడుగా మాట్లాడేవాడినన్నారు.

ఒకసారి సభ ముగిసిన తర్వాత రోశయ్య తనను పిలిపించుకున్నారని వెల్లడించారు. తన రాజకీయ ప్రస్థానంలో రోశయ్య ఎన్నో ఆలోచనలు, సూచనలు ఇచ్చేవారని సీఎం తెలిపారు. తనలోని రాజకీయ సామర్థ్యాన్ని కుటుంబ సభ్యుల కంటే ముందే గుర్తించి ప్రోత్సహించిన వ్యక్తి రోశయ్యేనని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>