కలం, మునుగోడు : భవన నిర్మాణం వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలవుతున్న స్కీములను పెంచాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (CITU) రాష్ట్ర కార్యదర్శి చిన్నపాక లక్ష్మీనారాయణ కోరారు. మంగళవారం చండూరు మండల సెంట్రింగ్ కార్మికులు సిఐటియు లో చేరారు. ఈ సందర్భంగా వారికి సీఐటీయూ కండువాలు కప్పిన అనంతరం మాట్లాడుతూ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందించాలన్నారు. సహజ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలని, సిఎస్‌సి హెల్త్ టెస్టులు ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం ప్రజా పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు నిధులు దుర్వినియోగం అవుతున్న పట్టించుకోవడంలేదని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారా అమలవుతున్న ప్రమాద మరణం, సహజ మరణం, శాశ్విత, పాక్షిక అంగవైకల్యం లాంటి స్కీములను జీవో నెంబర్ 12 ద్వారా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తూ 346.36 కోట్ల క్రెడిట్ యాక్సిస్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం కార్మికులకు అన్యాయం చేయడమేనని ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు.
సిఎస్ సి హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అవసరం ఉన్నా లేకున్నా ప్రతి కార్మికుడు పేరు మీద 2వేల 309 ప్రీమియం చెల్లిస్తూ పోతే బోర్డు నిధులు రోజురోజుకు తరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమం కోసం కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలకు వందల కోట్లు కట్టబెడుతున్నారు. రాష్ట్రంలో 28 లక్షల మంది వెల్ఫేర్ బోర్డులో పేర్లు నమోదు చేయించుకుంటే 15 లక్షల మంది కార్డులు మాత్రమే రెన్యువల్ చేసి మిగతా 13 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కు సంక్షేమ పథకాలు అందకుండా వారి కడుపులు కొడుతున్నారు. 55 సంవత్సరాలు వయసు పైబడిన భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని పిల్లల చదువులకు స్కాలర్ షిప్స్ ఇవ్వాలని కోరారు.
అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పెండ్యాల నాగరాజు కార్యదర్శిగా గొడ్డేటి పెద్ద స్వామి నలుగురు ఆఫీస్ బేరర్స్ తో పాటు 15 మంది సభ్యులతో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వరికుప్పల ముత్యాలు, సిఐటియు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రేవెల్లి యాదయ్య, యూనియన్ నాయకులు మాలే లింగస్వామి, ఆవుల సురేష్, మండలి రాము, ఆలేటి నాగరాజు, వి స్వామి, ఎం రవి గడ్డం నరేష్, ఉడుత రమేష్, బరిగల జనార్ధన్, గొడ్డేటి చిన్నస్వామి, కడారి గిరి, ఆస్కాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

