కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర అటవీశాఖతో పాటు వివిధ జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) (IFS promotion) హోదా కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 బ్యాచ్ కు చెందిన ఐ. ప్రకాశ్, జీ.ముకుంద్ రెడ్డి. 2021 బ్యాచ్ ఏ. నరసింహ రెడ్డి, డీ. సంహిత. 2022 ఎం.జోజి, జీబీ. రేఖా భాను, సీహెచ్ గంగా రెడ్డి. 2023 బ్యాచ్ ఎస్. రాజశేఖర్ పదోన్నతి కల్పించేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఆమోదం తెలిపింది.

