epaper
Sunday, February 22, 2026
epaper

పంచాయతీలకు సెంట్రల్ ఫండ్స్ రిలీజ్.. ఇంకా రూ.1400 కోట్లు పెండింగ్

కలం, తెలంగాణ బ్యూరో: గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి నిధుల విడుదల ఊపందుకున్నది. రెండు వారాల వ్యవధిలోనే సుమారు రూ. 1,034 కోట్లు రిలీజ్ అయ్యాయి. ఇంకా దాదాపు రూ. 1400 కోట్లు రావాల్సి ఉన్నది. వచ్చే నెల 31న ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున అప్పటివరకు ఇవి కూడా విడుదల కావచ్చని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ నిధుల విడుదల కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కేంద్ర అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నుంచి నిధుల విడుదల ఆగిపోయింది. రెండేండ్ల బకాయిలు దాదాపు రూ. 2,400 కోట్లుగా రాష్ట్ర ప్ఱభుత్వ అంచనా. ఇవి కాక దాదాపు రూ. 600 కోట్లు మండల, జిల్లా పరిషత్‌లకు బకాయిలున్నాయి.

పంచాయతీల వాటా రూ. 2,400 కోట్లు :

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అంచనా ప్రకారం 15వ ఆర్థిక సంఘం నుంచి గ్రామ పంచాయతీలకు రూ. 2,400 కోట్లకు పైగా రావాల్సి ఉండగా ఈ నెల రూ. 259.36 కోట్లు, ఈ నెల 12న రూ. 387.53 కోట్లు విడుదలయ్యాయి. దానికి ముందు రూ. 387.53 కోట్లు రిలీజ్ అయ్యాయి. దీంతో మూడు విడతల్లో మొత్తం రూ. 1,034.42 కోట్లు రిలీజ్ అయ్యాయి. ఇంకా సుమారు రూ. 1400 కోట్లకు పైగానే విడుదల కావాల్సి ఉన్నది. ఇప్పటివరకు విడుదలైన నిధులను గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం, పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం ఖర్చు చేయాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాలు కూడా కొలువుదీరితే అదనంగా మరో రూ. 600 కోట్లకు పైగా విడుదలయ్యే అవకాశమున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>