Mobile Popup Ad
Mobile Popup Ad

క్యూఆర్ కోడ్ వ్యవహారంపై స్పందించిన సీబీఎస్ఈ

క‌లం, వెబ్ డెస్క్‌: సీబీఎస్ఈ (CBSE) మ్యాథ్స్ ప్ర‌శ్నాప‌త్రంపై యూట్యూబ్ సాంగ్‌ క్యూఆర్ కోడ్ (QR Code) ఉండ‌టం తీవ్ర దుమారాన్ని రేపింది. దీంతో ప్ర‌శ్నాప‌త్రాల భ‌ద్ర‌తపై విద్యార్థులు, త‌ల్లిదండ్రుల్లో అనుమానాలు రేకెత్తాయి. ఈ అంశం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన నేప‌థ్యంలో సీబీఎస్ఈ దీనిపై స్పందించింది. ప్ర‌శ్నాప‌త్రాల ప్రామాణిక‌త‌పై విద్యార్థుల‌కు ఎలాంటి అపోహ‌లు అవ‌స‌రం లేద‌ని వెల్ల‌డించింది. భ‌ద్ర‌త‌లో రాజీప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని క్లారిటీ ఇచ్చింది. ప్ర‌శ్నాప‌త్రాల‌న్నీ స‌రిగ్గానే ఉన్నాయ‌ని, సోష‌ల్ మీడియాలో వ‌చ్చే పుకార్ల‌కు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపింది. ఇక క్యూఆర్‌ కోడ్ విషయంలో తలెత్తిన పొరపాటును అత్యంత సీరియస్‌గా పరిగణించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని వెల్ల‌డించింది.

Read Also: ఆ దేశంలో బంగారం ధరలు భారీగా పతనం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>