నీట్ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం

కలం, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన నీట్ పేపర్ లీకేజీ (NEET Paper Leak) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లీకేజీకి పాల్పడినట్లు భావిస్తున్న 14 మంది నిందితులపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అభియోగాలు మోపింది. స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసుపై విచారణ జరుపుతున్నారు. అవినీతి నిరోధకం చట్టంలోని కుట్ర, మోసం, నమ్మకద్రోహం సెక్షన్లను జోడించారు. నిందితుల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చెందిన ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులు కూడా ఉన్నారు. ఈ నెల 25 నుంచి రోజువారీ విచారణ ప్రారంభం కాబోతున్నారు. నేరం రుజువైతే.. వీరికి జీవిత ఖైదుతో పాటు భారీ జరిమానాలు కూడా విధించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అసలేం జరిగిందంటే..

దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్ విద్య అభ్యసించాలనుకునే వారి కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ఏడాది మే 3వ తేదీన నీట్ పరీక్ష నిర్వహించింది. 22 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే పరీక్ష జరగడానికి ముందే ప్రశ్నాపత్రంలోని కొన్ని ప్రశ్నలు బయటకు రావడం కలకలం రేపింది. దీంతో మే 12న నీట్ రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. పలువురిని అదుపులోకి తీసుకున్న సీబీఐ.. కుట్ర ఎలా జరిగిందో పూర్తి ఆధారాలను సేకరించింది. జూన్ 21న భారీ భద్రత మధ్య మరోసారి నీట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.

Also Read : చిన్న ఏనుగుకు పెద్ద క‌ష్టం.. విమానంలో త‌ర‌లించి చికిత్స‌

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>