కలం, జోగులాంబ గద్వాల: గద్వాల (Gadwal) పట్టణంలోని నదీ అగ్రహారం వద్ద గల కృష్ణానది పుష్కరఘాట్ వద్ద బుధవారం ఓ కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవరాత్రి ఉత్సవాల అనంతరం గద్వాల ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు బుధవారం నదీ అగ్రహారం పుష్కరఘాట్ వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గద్వాలకు చెందిన కృష్ణయ్య తన కారును ఘాట్ వద్ద ఆపి పూజల్లో పాల్గొన్నారు.
అయితే, అనుకోకుండా కారు హ్యాండ్ బ్రేక్ విడిపోవడం (న్యూట్రల్ కావడంతో) ఒక్కసారిగా కారు ముందుకు కదిలి, అక్కడ పూజల నిమిత్తం వేసిన టెంట్ ను ఢీకొంటూ నేరుగా కృష్ణానదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం గద్వాల (Gadwal) జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన గద్వాల పోలీసులు, క్రేన్ సహాయంతో కృష్ణానదిలో పడిపోయిన కారును బయటకు వెలికితీశారు.
Also Read : పోలీస్ ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Follow Us On: Youtube

