పోలీస్ ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : పోలీస్ ఉద్యోగాలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ లో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. 2028 వరకు పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని ప్రకటించారు. 2025 అక్టోబర్ నాటికే 16 వేల పోలీస్ ఉద్యోగాలు నియమించామన్నారు.

2026లో మరో 7 వేల 437 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని.. 2028 నాటి ఖాళీలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పోలీసుల పిల్లల కోసం పోలీస్ స్కూల్ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అక్టోబర్ 21న దేశ వ్యాప్తంగా పోలీసు అమరుల దినం జరుపుకుంటున్నామన్నారు.

మన కోసం జీవితాలను త్యాగం చేసిన వారిని స్మరించుకుందామని రేవంత్ రెడ్డి (Revanth Reddy) పిలుపునిచ్చారు. 2026లో దేశవ్యాప్తంగా 154 మందికి పైగా పోలీసులు విధి నిర్వహణలో ప్రాణ త్యాగాలు చేశారని వెల్లడించారు. అమరులైన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

Also Read : ఎల్‌నినో ప్రభావం.. సినీ నటులకు భట్టి కీలక విజ్ఞప్తి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>