ఢిల్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కారణమిదే!

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిపై పోలీసుల దాడి చేశారని జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేయబోతున్నారు. మహిళా ఎమ్మెల్యేలతో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి ఎమ్మెల్యేలు కూడా హస్తిన వెళ్లబోతున్నారు. ఈ మేరకు కేటీఆర్ నివాసంలో జరిగిన బ్రేక్ ఫాస్ట్ మీటింగులో నిర్ణయించుకున్నారు. వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌ను కోరబోతున్నారు.

సైబర్ క్రైంలో ఫిర్యాదు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో ఏఐ ఫొటోలతో దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఇప్పటికే మండిపడ్డారు. ఈ మేరకు మధ్యాహ్నం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నారు. తాము పోలీసులపై దాడికి పాల్పడినట్లుగా చిత్రాలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. దీని వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర దాగి ఉందని, వెంటనే విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>