ఎల్ నినో ప్రభావం.. ప్రభుత్వంపై పువ్వాడ ఆగ్రహం

కలం, ఖమ్మం బ్యూరో : వాతావరణంలో మార్పులు, ఎల్ నినో ప్రభావంపై ముందే హెచ్చరికలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించిందని బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్‌కుమార్ (Puvvada Ajay) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థ పాలన కారణంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

​పంట పొలాలకు తగినంత సాగునీరు, వేళకు కరెంటు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. సాగునీరు, విద్యుత్ అందక క్షేత్రస్థాయిలో పంటలు ఎండిపోతుంటే రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని, వారి రోదనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రైతాంగం ఎదుర్కొంటున్న ఈ కష్టాలపై బీఆర్ఎస్ పక్షాన ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, పోరాటాలు చేస్తున్నప్పటికీ పాలకులు కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ​

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని కోరారు. తక్షణమే అధికారులను క్షేత్రస్థాయికి పంపి ఎండిపోతున్న పంటలను పరిశీలించాలని, అత్యవసర ప్రాతిపదికన సాగునీరు, ఉచిత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి రైతాంగాన్ని ఆదుకోవాలని పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>