కలం, తుర్కపల్లి : హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రతి భారతీయుడిలో దేశభక్తి, జాతీయ ఐక్యత, దేశం పట్ల గౌరవ భావాన్ని పెంపొందించే గొప్ప కార్యక్రమమని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా పాలసీ రాష్ట్ర కన్వీనర్ సురివి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తుర్కపల్లి మండల కేంద్రంలో బుధవారం భారతీయ జనతా పార్టీ తుర్కపల్లి (Turkapally Mandal) మండల అధ్యక్షులు మేకల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై కార్యశాల నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా పాలసీ రాష్ట్ర కన్వీనర్ సురివి శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడుతూ ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తుర్కపల్లి మండలంలోని ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొక్కొండ లక్ష్మీనారాయణ గౌడ్, జిల్లా మీడియా కో-కన్వీనర్ భానోత్ శంకర్ నాయక్, రాష్ట్ర ట్రేడర్స్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి చల్మయ్య, మాజీ సర్పంచ్ జక్కుల వెంకటేశం, గొర్ల రామచంద్రం, గుండెబోయిన మల్లేశం, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి బొల్లూ నర్సింహ యాదవ్, జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి మలోత్ రమేష్, జిల్లా యువ మోర్చా కార్యదర్శి మేకల పాండు బిజెపి నాయకులు పాల్గొన్నారు.

