భద్రాచలం ఆసుపత్రికి రూ.15 లక్షల ఆధునిక పరికరాలు!

కలం, ఖమ్మం బ్యూరో: ఏజెన్సీ ప్రాంత ప్రజలకు, పేద రోగులకు ఉచిత వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి (Bhadrachalam Hospital) రూ.15 లక్షల విలువైన ఆధునిక వైద్య పరికరాలను అందజేశారు. ఐటీడీఏ నిధులతో సమకూర్చిన ఈ పరికరాలను భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి. రాహుల్ సోమవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డికి అందించారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణతో పాటు సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ఏజెన్సీ గ్రామాల నుంచి నిత్యం వందలాది మంది పేద రోగులు భద్రాచలం ఆసుపత్రినే నమ్ముకుని వస్తారని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని, కొత్తగా వచ్చిన పరికరాలను సద్వినియోగం చేసుకుని సేవలు అందించాలని వైద్యులను కోరారు.

​అనంతరం ఐటీడీఏ పీవో రాహుల్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో వైద్య వసతుల మెరుగుదలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. ఐటీడీఏ నిధుల ద్వారా కంటి పరీక్ష సాధనాలు, బ్లడ్ టెస్టింగ్ యంత్రాలు, ఈసీజీ మిషన్లు, ఆక్సిజన్ సిలిండర్లను ఆసుపత్రికి సమకూర్చామని వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్‌వో, ఐసీయూ ఇన్‌చార్జ్ డాక్టర్ జగదీష్, డాక్టర్ మల్లేష్, ప్రజాప్రతినిధులు నర్రా రాము, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>