కడుతుల గ్రామంలో ఎలుగుబంటి కలకలం

కలం, వెబ్ డెస్క్ : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కడుతుల (Kadutula) గ్రామంలో ఎలుగుబంటి (Bear) కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు ఈ ఎలుగుబంటి ప్రత్యక్షమవడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. కూలీలు, గ్రామ యువకులు కలిసి ఎలుగుబంటిని అడవి వైపు తరిమేందుకు ప్రయత్నించగా, అది వారిపైకి దూసుకొచ్చింది. దీంతో వారు భయంతో వెనక్కి తగ్గారు. జనావాస ప్రాంతంలో తరచూ వన్యప్రాణులు వస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంటిని వెంటనే అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను వారు కోరుతున్నారు.

Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు TGPSC నుంచి 3 నోటిఫికేషన్లు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>