అండమాన్‌కు సభ్యత్వం ఉందా? బీసీసీఐ నిర్ణయం!

కలం, స్పోర్ట్స్ : భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వచ్చే నెల 18వ తేదీన ముంబైలోని తన ప్రధాన కార్యాలయంలో వార్షిక సాధారణ సమావేశాన్ని (AGM) నిర్వహించనుంది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా సభ్య సంఘాలకు సమాచారం అందించారు. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు.

అందులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి భారతదేశ ప్రతినిధిని నామినేట్ చేయడం అత్యంత ముఖ్యమైన అంశంగా ఉంది. దీనితో పాటు, అండమాన్ అండ్ నికోబార్ దీవుల క్రికెట్ అసోసియేషన్‌కు ‘అసోసియేట్ మెంబర్‌షిప్’ ఇచ్చే ప్రతిపాదనపై చర్చించనున్నారు.

గతంలో అపెక్స్ కౌన్సిల్ భేటీలో వచ్చిన ఈ అంశాన్ని ఇప్పుడు సభ్యుల ఆమోదం కోసం ఏజీఎమ్‌లో ఉంచనున్నారు. ఒకవేళ దీనికి ఆమోదం లభిస్తే అండమాన్ అండ్ నికోబార్‌ బోర్డు పరిధిలోకి వస్తుంది. అసోసియేట్ సభ్యత్వం లభిస్తే ఓటింగ్ హక్కులు ఉండవు. అయితే భారత దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో ఆడే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం బోర్డు ఆమోదించిన పోటీల్లో 38 జట్లు పాల్గొంటున్నాయి.

మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ భేటీలో తీసుకోనున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) గవర్నింగ్ కౌన్సిల్‌కు ఇద్దరు ప్రతినిధులను ఎన్నుకుంటారు. అలాగే ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ నుంచి ఒకరిని గవర్నింగ్ కౌన్సిల్‌లోకి తీసుకుంటారు. కొత్తగా ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేయనున్న జూనియర్ సెలక్షన్ కమిటీ నియామకానికి కూడా ఈ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>