కలం, జోగులాంబ గద్వాల: తమ సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం గద్వాల (Gadwal) జిల్లా కేంద్రంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె (Bank Employees Strike) లో పాల్గొన్నారు. యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంకులకు 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు ర్యాలీ చేశారు.
ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలని, పీఎల్ఐని ఉపసంహరించుకోవాలని, ఇతర పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఈనెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజులు తిరిగి సమ్మె చేస్తామన్నారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే అక్టోబరు 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు.

