Mobile Popup Ad
Mobile Popup Ad

రాహుల్, రేవంత్ మహిళా ద్రోహులు: బండి సంజయ్

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముమ్మాటికి మహిళా ద్రోహులేనని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)  ఆరోపించారు. మహిళా బిల్లును అడ్డుకొని ద్రోహం తలపెట్టారని ఫైర్ అయ్యారు. భారత ప్రజాస్వామ్యానికి ఏప్రిల్ 17 చీకటి రోజని అభివర్ణించారు. ఈ దేశంలో ఉన్న ప్రతి తల్లి, అక్కా, చెల్లి, కుమార్తెకు మహిళా బిల్లు వీగిపోవడం అవమానకరమన్నారు. లోక్ సభలో వ్యవహరించిన తీరుతో కాంగ్రెస్, ఇండి కూటమి అసలు రంగు బయటపడిందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ కాలకూట విషం కక్కిందని ఫైర్ అయ్యారు. మహిళలను హక్కులను కబలించడం మహాపాపం అంటూ అభివర్ణించారు.

మహిళలను ఓడించి సంబురాలా?

దేశంలోని మహిళలందరినీ ఓడించినందుకు కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. దేశ మహిళలు త్వరలోనే కాంగ్రెస్ కూటమిని ఓడించి సంబురాలు చేసుకునే రోజులు రాబోతున్నాయన్నారు. కాంగ్రెస్ మొదటి నుంచి మహిళా వ్యతిరేకి అని పేర్కొన్నారు. కుటుంబపార్టీలన్నీ కలిసి మహిళా బిల్లును వ్యతిరేకించాయని విమర్శించారు. డూప్లికేట్ గాంధీ, స్టాలిన్, అఖిలేష్ కుటుంబాల మహిళలకు మాత్రమే పదవులుండాలా? అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సాధారణ మహిళలకు చట్టసభల్లో వాటా ఇస్తుంటే ఓర్వలేక బిల్లును అడ్డుకున్నారంటూ మండిపడ్డారు.

ఓడించింది ఎన్డీయేను కాదు మహిళలను

కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమిని ఓడించలేదని.. దేశంలోని మహిళలందరినీ ఓడించిందని బండి సంజయ్ (Bandi Sanjay)  పేర్కొన్నారు. అధికారంలో ఉన్నంత కాలం మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి వంచించారని పేర్కొన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్‌ను పదేపదే ఓడిస్తూ ఛీ కొడుతున్నా ఆ పార్టీ నేతలకు జ్ఝానోదయం కలగడం లేదని ఫైర్ అయ్యారు. బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే కాంగ్రెస్, టీఎంసీ పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కూటమికి మహిళా శక్తి అంటే ఏమిటో చాటి చెప్పాలంటూ సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>