కలం, వెబ్ డెస్క్: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్లో నిర్వహిస్తున్న ‘అలయ్ బలయ్’ (Alai Balai) కార్యక్రమం ఘనంగా జరిగింది. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. దసరా అనంతరం దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని కొన్నేళ్లుగా నిర్వహిస్తూ వస్తున్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి ‘అలయ్ బలయ్’ గొప్ప ఉదహరణ అన్నారు. ప్రజలు ఐకమత్యంగా ఉండాలనే సారాంశం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం అన్నారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ప్రతి ఏడాది అలయ్ బలయ్ నిర్వహించడం ద్వారా.. తెలంగాణ విశిష్ట సంస్కృతిని దేశానికి చాటుతున్నారని దత్తాత్రేయపై ప్రశంసలు కురిపించారు.
ఇదొక ఆత్మీక వేదిక..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. అలయ్ బలయ్ కేవలం ఉత్సవం కాదని.. మనసులను కలిపే ఆత్మీయ వేదిక అన్నారు. రాజకీయాలకు అతీతంగా స్నేహాన్ని చాటే గొప్ప సంప్రదాయాన్ని దత్తాత్రేయ కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనుషుల మధ్య దూరం కూడా పెరుగుతోందన్నా.. సమాచారంత పాటు ఆత్మీయ అనుబంధాలు కూడా అంతే అవసరమన్నారు. మహిళలకు గౌరవం, యువతకు అవకాశాలు, పెద్దలకు ఆదరణ, బలహీనవర్గాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

