సాయన్న ఆశయాల సాధనే మన లక్ష్యం: నందిమల్ల చంద్రమౌళి

కలం, వనపర్తి: అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన పండుగ సాయన్న (Panduga Sayanna) ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్‌ ఓబీసీ నాయకుడు, వనపర్తి ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు నందిమల్ల చంద్రమౌళి (Nandimalla Chandramouli) పిలుపునిచ్చారు. గురువారం వనపర్తిలోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆదేశాల మేరకు నందిమల్ల చంద్రమౌళి ఆధ్వర్యంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ.. పండుగ సాయన్న జీవితం, ఆయన పోరాటాలు, సమాజానికి అందించిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి ప్రజల మన్ననలు పొందిన మహనీయుడని కొనియాడారు. ధైర్యసాహసాలు, ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత ఆయన జీవితంలో కనిపిస్తాయని పేర్కొన్నారు. సాయన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, కాంగ్రెస్‌ ఎస్సీ డిపార్ట్‌మెంట్‌ జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్‌, పెబ్బేరు మండల అధ్యక్షుడు రాంరెడ్డి, సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు జానకిరాములు, పార్టీ అధికార ప్రతినిధులు జనార్దన్‌ సాగర్‌, ముదిరాజ్‌ సంఘం నాయకులు, మాజీ కౌన్సిలర్‌ గణేష్‌, కూరగాయల రవి, పూజారి వెంకటస్వామి, నందిమల్ల నిఖిల్‌ చంద్ర ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>