కలం, జగిత్యాల: జగిత్యాల (Jagtial) పట్టణంలోని పురాణిపేట ఆంజనేయస్వామి దేవాలయం ఆధ్వర్యంలో ఆషాడ మాస బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఆషాడ మాసంలో అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం రోజున ఆంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్ నివో ప్రభావం పూర్తిగా తగ్గి, వర్షాలు బాగా కురవాలని వేడుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో కొత్త ప్రతాప్, నలుమాచు గంగాధర్, గిరి నాగభూషణం, కొయ్యేడ రమేష్, కొత్త మోహన్, అవారి శివకేసరి బాబు, చెట్ల జానకి, బట్టు సుజాత, ఠాకూర్ పాల్గొన్నారు.

