కలం, వెబ్ డెస్క్ : యానాం, నరసాపురం మధ్య అర్నాబ్ తుఫాన్ (Arnab Cyclone) తీరం దాటింది. అత్యంత తీవ్ర తుఫాన్ నుంచి, ప్రస్తుతం తీవ్ర తుఫాన్‌గా బలహీనపడింది. తుఫాన్ కేంద్రం పూర్తిగా భూభాగంపైకి చేరుకోవడంతో, రానున్న 6 నుంచి 7 గంటలు అత్యంత కీలకంగా మారాయి.
బలమైన ఈదురుగాలుల ప్రభావంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

