కలం, వెబ్‌డెస్క్: కొడుకు చేసిన యాక్సిడెంట్‌కు సంబంధించి సాక్ష్యాలు తారుమారు చేసిన కేసులో శ్రీకాకుళం జైలులో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju)కు హైకోర్ట్ షాకిచ్చింది. ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. మరోవైపు పోలీసులు అప్పలరాజును కస్టడీ కోసం అప్పగించాలని కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో అప్పలరాజు తరఫు న్యాయవాదులు తదుపరి న్యాయపోరాటంపై దృష్టిసారించారు.
ఈ నెల 10న అప్పలరాజు కొడుకు బైక్‌పై వెళ్తూ దానయ్య అనే గొర్రెల కాపరిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో దానయ్య అక్కడికక్కడే మరణించాడు. అయితే కుమారుడిని రక్షించేందుకు అప్పలరాజు ఈ కేసులో సాక్ష్యాలను మార్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన శ్రీకాకుళం జైలులో ఉన్నారు.

