కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meeting) జరగనుంది. రాజధాని నగరం అమరావతి రూపురేఖలను మార్చేలా రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) రూపొందించిన కీలక ప్రతిపాదనలకు కేబినెట్ తన ఆమోద ముద్ర వేయనుంది. ఇందులో భాగంగా అమరావతిలో అత్యాధునిక లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు రూ.596 కోట్లు మంజూరు చేయనున్నారు.
దీనితో పాటు రాజధాని పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక మౌలిక వసతుల కల్పనకు రూ.533 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, వారి ప్లాట్ల వద్దకు రవాణా సదుపాయం మెరుగుపరిచేందుకు బీటీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలపై కేబినెట్ (AP Cabinet Meeting) చర్చించనుంది. అలాగే అమరావతి నుంచి మంగళగిరి–తాడేపల్లి ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్రతిపాదించిన ప్రణాళికతో పాటు, రాజధాని రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే ఇన్నర్ రింగ్ రోడ్డు, నూతన రైల్వే లైన్ నిర్మాణాల కోసం అవసరమైన భూ సమీకరణ అంశంపై కూడా ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read : ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రాగా మార్చుతాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)

