చారిత్రక విజయం: సౌత్ కరోలినా సెనెటర్‌గా ఆనీ ఆండ్రూస్!

కలం, వెబ్ డెస్క్ : అమెరికాలోని సౌత్ కరోలినా యునైటెడ్ స్టేట్స్ సెనెట్ స్థానానికి జరిగిన కీలక ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి, పీడియాట్రీషియన్ డాక్టర్ అన్నీ ఆండ్రూస్ (Annie Andrews) చారిత్రాత్మక విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీకి గట్టి పట్టున్న ఈ స్థానంలో ఆమె ప్రత్యర్థి, ప్రస్తుత సెనెటర్ డార్లిన్ గ్రాహమ్‌పై విజయాన్ని నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దివంగత సెనెటర్ లిండ్సే గ్రాహమ్ హఠాన్మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఆయన సోదరి డార్లిన్ గ్రాహమ్‌ను నియమించగా, ఈ ఎన్నికల్లో ఆమె రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.

విజయం అనంతరం అన్నీ ఆండ్రూస్ మాట్లాడుతూ, వాషింగ్టన్‌లో తనకు ఎవరూ ఈ సెనెట్ సీటును ఉచితంగా ఇవ్వలేదని, తానెవరికీ రుణపడి లేనని స్పష్టం చేశారు. తనకు ప్రతి విషయంలోనూ బాధ్యత వహించేది సౌత్ కరోలినా ప్రజలేనని, వారి అభివృద్ధికే ప్రాధాన్యమిస్తానని ప్రకటించారు. హెల్త్‌కేర్ ప్రాప్యత, ప్రజారోగ్యం, వాషింగ్టన్ రాజకీయాల్లో పారదర్శకత అంశాలపై ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఓటర్ల మద్దతు కూడగట్టారు. 1998 తర్వాత సౌత్ కరోలినా నుంచి సెనెట్ స్థానాన్ని గెలుచుకున్న తొలి డెమొక్రాట్‌గా అన్నీ ఆండ్రూస్ నిలిచారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>