Mobile Popup Ad
Mobile Popup Ad

“పెద్ది” సినిమా చూసిన అల్లు అర్జున్‌.. షాకింగ్ రియాక్ష‌న్‌!

క‌లం, వెబ్ డెస్క్: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) న‌టించిన లేటెస్ట్ మూవీ పెద్ది (Peddi movie) స‌క్సెస్‌ఫుల్ టాక్‌తో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాపై సెల‌బ్రెటీలు ఎవ‌రూ రెస్పాండ్ కావ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్న త‌రుణంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఎక్స్ వేదిక‌గా స్పందించారు. సోమ‌వారం రాత్రి పెద్ది సినిమా చూసిన‌ట్లు బ‌న్నీ త‌న పోస్టులో వెల్ల‌డించాడు. ఈ సంద‌ర్భంగా మూవీ టీంకు త‌న విషెస్ తెలియ‌జేశాడు. రామ్ చ‌ర‌ణ్ త‌న మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ ప‌ర్ఫామెన్స్‌తో ఇర‌గ‌దీశాడ‌ని ఆకాశానికెత్తేశాడు. ఇక సినిమాలో చ‌ర‌ణ్ ర‌ఫ్ అండ్ ట‌ఫ్ లుక్, బాడీ ట్రాన్స్‌ఫార్మేష‌న్‌, గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూవ్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నాయ‌ని పొగిడాడు. చ‌ర‌ణ్‌ను చూస్తుంటే చాలా గ‌ర్వంగా ఉంద‌ని, ఈ సినిమా సాధించిన విజ‌యం ప‌ట్ల చాలా సంతోషంగా ఉంద‌ని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ చిత్రంలో జ‌గ‌ప‌తి బాబు నుంచి హీరోయిన్ జాన్వీ క‌పూర్ వ‌ర‌కు ప్ర‌తి ఆర్టిస్ట్‌ చాలా అద్భుతంగా న‌టించార‌ని బ‌న్నీ ప్ర‌శంసించాడు. అలాగే సినిమాకు ప‌ని చేసిన‌ సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు హృదయపూర్వక అభినందనలు తెలిపాడు. ఇక దర్శకుడు బుచ్చిబాబు స‌నాను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరినీ ఎలివేట్ చేస్తూ, చరణ్‌ను అత్యున్నత స్థాయిలో నిలబెట్టారంటూ ఆయనకు కృతజ్ఞతలు తెల‌పాడు. ఇక పెద్ది సినిమాకు సెలెబ్రెటీలు ఎవ‌రూ రెస్పాండ్ కావ‌డం లేదంటూ వ‌స్తున్న వార్త‌ల‌కు బ‌న్నీ చెక్ పెట్టేశాడు. మ‌రి ఇంకా రానున్న రోజుల్లో ఎవ‌రెవ‌రు రెస్పాండ్ అవుతారో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>