బాల్య వివాహాలు నిర్మూలించి, అమ్మాయిలను చదివించాలి: అదనపు కలెక్టర్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలో బాల్య వివాహాలను (Child Marriages) నిర్మూలించి, అమ్మాయిలను ఉన్నత చదువులు చదివించాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ సూచించారు. శనివారం ఆత్మకూరు మండలంలోని పిన్నంచెర్ల గ్రామ పంచాయతీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ప్రత్యేక గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు రోడ్డు భద్రత, బాల్యవివాహాల నిర్మూలన, వర్షాకాలం నేపథ్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటు, పరిసరాల పరిశుభ్రత, వన మహోత్సవం, జల సంరక్షణ, పాఠశాలల్లో సౌకర్యాలు సహా తదితరాంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి..

అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బాల్య వివాహాలను (Child Marriages) నిర్మూలించి, అమ్మాయిలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి.. ప్రస్తుతం జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి చదివించాలని సూచించారు. అమ్మాయిలకు బాల్యవివాహాలు చేయకుండా ఉన్నత చదువులు చదివించాలని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చాయని కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం అర్హులైన ఓటర్లందరినీ జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తుందని ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని అధికారులకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా గ్రామంలో గత ఐదేళ్ల వ్యవధిలో 18 ఏళ్ల నుండి 59 ఏళ్లలోపు వ్యక్తులు ఎవరైనా మరణిస్తే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా దరఖాస్తు చేసుకొని రూ. 20 వేల లబ్ధి పొందవచ్చని తెలిపారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా గ్రామంలో భూగర్భ జలాలు పెరిగి మంచినీటి సదుపాయాలు కలుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ రఘునాథ్, మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ స్థాయి సిబ్బంది,పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Read Also: మోదీ పాలనలో అన్ని రంగాలు నాశనం: మల్లికార్జున ఖర్గే

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>