epaper
Friday, January 16, 2026
spot_img
epaper

మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న టీమిండియా ప్లేయర్లు వీళ్లే

కలం డెస్క్ : Team India Cricket Players | క్రికెట్ అంటే ఇండియన్స్‌కు జస్ట్ స్పోర్ట్ కాదు.. అదొక ఎమోషన్. దేశంలో ఎన్నో విషయాల్లో విభేదాలు ఉన్నా క్రికెట్ అంటే కోట్ల మంది ఏకతాటిపైకి వచ్చేస్తారు. అందుకే టీమిండియా ప్లేయర్స్ హవా క్రికెట్ స్టేడియంలోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా భారీగానే ఉంటుంది. టీమిండియా క్రికెటర్ ఒక పోస్ట్ పెట్టాడంటే లక్షల్లో వ్యూస్ వస్తాయి. వాళ్ల ఫాలోవర్లు కూడా వేలల్లో కాదు లక్షల్లో, కొందరికి అయితే కోట్లలో ఉంటారు. వాళ్లకు ఫాలోయింగ్ అనేది చాలా మార్గాల నుంచి వస్తుంది. వాటిల్లో ఐపీఎల్ స్టార్ డమ్ కూడా ఒకటి. ప్లేయర్స్ తమ సత్తా చాటుకోవడానికి ఐపీఎల్ ఒక అద్భుతమైన వేదికగా నిలిచింది. ఎందరో టాప్ ప్లేయర్స్ ఐపీఎల్‌లోనే పరిచయం అయ్యారు. మరి ప్రస్తుతం టీమిండియాలో ఉన్న ప్లేయర్స్‌లో టాప్ ఫాలోయింగ్ ఉన్న ఆటగాళ్లు ఎవరెవరంటే..

1. హార్దిక్ పాండ్య: హార్దిక్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 43 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. టీమిండియాలో కూడా హార్దిక్ కీలక ప్లేయర్‌గా ఉన్నాడు. భారతదేశం ఇటీవల సాధించిన ఐసిసి విజయాలు, 2024 టి 20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలలో అతని ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకున్నాయి.

2. జస్‌ప్రిత్ బుమ్రా: 21.1 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో ఈ జాబితాలో బుమ్రా రెండో ప్లేస్‌లో ఉన్నాడు. అన్ని ఫార్మాట్స్‌లో టీమిండియా బెస్ట్ బౌలర్‌గా బుమ్రా ఉన్నాడు. వరల్డ్ క్రికెట్‌లో కూడా తన ఆధిపత్యం కనబరుస్తున్నాడు. అనేక సందర్భాలలో భారత జట్టుకు నాయకత్వం వహించి తన నాయకత్వాన్ని ప్రదర్శించాడు. ముంబై ఇండియన్స్‌తో అతని ఐపీఎల్‌లో అబ్బురపరిచే ప్రదర్శనలు, సీజన్ తర్వాత సీజన్‌లో మ్యాచ్ విన్నింగ్ స్పెల్‌లను అందించడం, అతన్ని గొప్ప ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా నిలిపాయి.

3. సూర్యకుమార్ యాదవ్: మూడో ప్లేయస్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. అతడికి ఇన్‌స్టాలో 18.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. స్థిరమైన ప్రదర్శనలు, ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం తర్వాత అతని స్టార్‌డమ్ పెరిగింది. భారత T20I కెప్టెన్‌గా, సూర్యకుమార్ 2024 నుండి బాధ్యతలు స్వీకరించాడు, నిర్భయమైన విధానంతో ముందుండి నడిపించాడు. ముంబై ఇండియన్స్‌తో IPLలో అతని విజయం బహుళ మ్యాచ్-విజేత నాక్‌లను అందించింది మరియు వారి టైటిల్ విజయాలలో కీలక పాత్ర పోషించింది. T20 ఫార్మాట్‌లో అతని రికార్డు బద్దలు కొట్టే పరుగు, అక్కడ అతని అసాధారణ 360-డిగ్రీల ఆటతీరు అతనికి చాలా కాలం పాటు ప్రపంచ నంబర్ 1 T20 బ్యాటర్ బిరుదును సంపాదించిపెట్టింది.

4. శుబ్‌మన్ గిల్: అండర్-19 నుంచే శుబ్‌మన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. క్రికెట్‌లో అతని ఆటతీరు అందరినీ ఆకట్టుకుంది. 17.3 మిలియన్ల మంది ఫాలోవర్లతో అతడు ఈ లిస్ట్‌లో నాలుగో స్థానంలో ఉన్నాడు.

5. సంజు శాంమ్‌సన్: 10.4 మిలియన్ల ఫాలోవర్లతో సంజు శామ్‌సన్ ఐదో స్థానంలో ఉన్నాడు. భారత T20I జట్టులో రెగ్యులర్‌గా ఉండటమే కాకుండా, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ సామ్సన్ ఆటగాడిగా మరియు కెప్టెన్‌గా అపారమైన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. సంజు ఫ్యాన్ బేస్ చూసి కెప్టెన్ సూర్యకుమార్ కూడా ఆశ్చర్యపోయాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>