కలం, వెబ్ డెస్క్: ఇరాన్ (Iran) యుద్ధ నౌకపై అమెరికా జరిపిన దాడిపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి (Abbas Araghchi) ఎక్స్ వేదికగా స్పందించారు. అమెరికా సముద్రంపై ఒక ఘోరమైన అపరాధానికి పాల్పడిందని పేర్కొన్నారు. ఇరాన్ తీరానికి 2,000 మైళ్ల దూరంలో దుర్ఘటన జరిగిందన్నారు. దాదాపు 130 మంది నావికులతో, భారత నౌకాదళానికి అతిథిగా ఉన్న ‘దేనా’ (Dena) యుద్ధనౌకపై ఎటువంటి హెచ్చరిక లేకుండా అంతర్జాతీయ జలాల్లో దాడి జరిగిందని చెప్పారు. అమెరికా చేసిన తప్పుకు భవిష్యత్తుతో తీవ్రంగా పశ్చాత్తాపం పడాల్సి వస్తుందని చెప్పారు.

