epaper
Wednesday, March 4, 2026
epaper

రీల్​కు రూ.80వేలు.. బెంగాల్​లో ఇన్​ఫ్లుయెన్సర్లకు డిమాండ్​​​​

కలం, వెబ్​ డెస్క్​: పశ్చిమబెంగాల్​లో (West Bengal) సోషల్​ మీడియా ఇన్​ఫ్లెయెన్సర్లకు కాసుల పంట పండింది. త్వరలో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనుండడంతో అన్ని పార్టీలూ ఇన్​ఫ్లుయెన్సర్​ల వేట మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఫాలోవర్లు, వ్యూస్​ను బట్టి ఒక్కో రీల్​కు రూ.20వేల నుంచి రూ.80వేల వరకు చెల్లించేందుకు సిద్ధపడుతున్నాయి. ఈ మేరకు వివిధ పార్టీల నుంచి తమకు వచ్చిన ఆఫర్ల మెసేజ్​లు, మెయిల్స్​ స్క్రీన్​షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్​ చేయడంతో వైరలవుతున్నాయి.

ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ కలిపి 43వేలకు పైగా ఫాలోవర్లు ఉన్న శాలిని ముఖర్జీ బెనర్జీ అనే ఇన్​ఫ్లుయెన్సర్​ తనకు రాజకీయ పార్టీల నుంచి ఆఫర్​ వచ్చినట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. ఎన్నికల్లో తమకు ప్రచారం చేస్తే ఒక్కో రీల్​కు రూ.20వేలు ఇస్తామని, అయితే.. ఇన్​స్టాగ్రామ్​లో కనీసం 20వేల మంది ఫాలోవర్లు ఉండాలని, యావరేజ్​ వ్యూస్​ 10నుంచి 15వేలకు తగ్గకుండా ఉండాలని కండిషన్స్​ పెడుతూ మెయిల్​ చేసినట్లు తెలిపింది. బీజేపీ, టీఎంసీతోపాటు ఇతర పార్టీల నుంచి కూడా ఇలా ఆఫర్​ వచ్చినట్లు పేర్కొంది. అలాగే తమకు డిజిటల్​ క్యాంపెయినింగ్​ చేస్తే ఒక్కో రీల్​కు రూ.80వేలు ఇస్తామని ఆఫర్​ వచ్చినట్లు కోల్​కతాకు చెందిన ప్రముఖ లైఫ్​స్టైల్​ వ్లాగర్​ కొనినిక దేవి సైతం వెల్లడించింది.

ఫాలోవర్లను బట్టి కేటగిరీలు, రేట్లు..

పార్టీలు ఎన్నికల్లో ప్రచారం కోసం సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్లను ఫాలోవర్లను బట్టి కేటగిరీలుగా విభజించాయి. 10వేల నుంచి లక్షలోపు ఫాలోవర్లు ఉంటే మైక్రో, లక్ష నుంచి 10లక్షల వరకు ఉంటే మాక్రో, 10లక్షలు దాటితే మెగా ఇన్​ఫ్లుయెన్సర్లుగా​ వర్గీకరించాయి. కొందరితో కేవలం ప్రచార రీల్స్​ మాత్రమే చేయమని సంప్రదిస్తున్నాయి. మరికొందరిని పాడ్​కాస్ట్​లు, ఇంటర్వ్యూలు చేయమని అడుగుతున్నాయి. ఫాలోవర్లు, వ్యూస్​, పనిని బట్టి లక్షల్లోనూ చెల్లించేందుకు సిద్ధమతున్నాయి. మొత్తానికి ఎన్నికల పుణ్యమా అని బెంగాల్​లో (West Bengal) ఇన్​ఫ్లుయెన్సర్లకు కాసుల వర్షం కురుస్తోంది.

Read Also: దక్షిణాఫ్రికాకు దడ పుట్టిస్తున్న కివీస్​.. 77కే సగం వికెట్లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!