epaper
Wednesday, March 4, 2026
epaper

ప్రాణం తీసిన హోలీ రంగులు.. ముగ్గురు స్టూడెంట్లు మృతి

కలం, డెస్క్ : హోలీ పండగ వేళ కృష్ణా (Krishna) జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని గన్నవరం మండలం చిక్కవరంలో ముగ్గురు స్టూడెంట్లు చెరువులో గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన నవీన్ కుమార్(11), సాయి (16), వెంకట జోసెఫ్(16)లు ఫ్రెండ్స్ తో కలిసి హోలీ ఆడారు. చేతులకు అంటుకున్న రంగులు కడుక్కుందామని దగ్గర్లోని చెరువు దగ్గరకు వెళ్లారు. ప్రమాద వశాత్తు కాలుజారి ముగ్గురూ చెరువులో పడిపోయారు. స్థానికులు గమనించేలోపే ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఇందులో వెంకట్, నవీన్ మృతదేహాలు దొరికాయి. సాయి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ముగ్గురి మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!