కలం, వెబ్ డెస్క్: టీమిండియా అదరగొట్టింది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది (India – Semifinals). ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో విజయంతో సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. కోల్‌కతా వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన సంజూ శాంసన్ ఆఖరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. మ్యాచ్‌ను ఫోర్‌తో ఫినిష్ చేశాడు. సంజూ 49 బంతుల్లో 93 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సంజూ కష్టానికి తగిన ఫలితం దక్కింది. ఈ విజయంతో భారత్ సెమీస్‌కు.. విండీస్ ఇంటికి వెళ్లాయి.
చావో రేవో అన్న మ్యాచ్‌లో శాంసన్ తన మార్క్ చూపించాడు. ఛేదనలో 196 పరుగుల భారీ లక్ష్యాన్ని తన విధ్వంసకర బ్యాటింగ్‌తో చాలా సులువుగా మార్చేశాడు. సంజూ మెరుపు ఇన్నింగ్స్ ధాటికి వెస్టిండీస్ బౌలర్లు చేతులెత్తేశారు. దీంతో భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో గెలుపు జెండా ఎగరేసింది.
ఓపెనర్‌గా వచ్చిన సంజూ ఆరంభం నుంచే విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ త్వరగానే అవుటైనా సంజూ ఏమాత్రం తగ్గలేదు. కేవలం 50 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. త్రుటిలో సెంచరీ మిస్ అయినా, జట్టుకు మాత్రం తిరుగులేని విజయాన్ని అందించాడు. తిలక్ వర్మ (27), సూర్యకుమార్ యాదవ్ (18) తమ వంతు సహకారం అందించారు.
అంతకుముందు వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో ఛేజ్ (40), జాసన్ హోల్డర్ (37 నాటౌట్), రోవ్‌మన్ పావెల్ (34 నాటౌట్) ధాటిగా ఆడారు. భారీ స్కోరు దిశగా సాగుతున్న విండీస్ ఇన్నింగ్స్‌ను భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అడ్డుకున్నారు. బుమ్రా తన పదునైన బంతులతో 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. వరుణ్ చక్రవర్తి కీలక సమయంలో ఒక వికెట్ తీసి విండీస్ జోరుకు బ్రేక్ వేశాడు. హార్దిక్ పాండ్యా ఒక వికెట్ పడగొట్టి తన వంతు బాధ్యత నెరవేర్చాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాడు(India – Semifinals). కీలక ఇన్నింగ్స్ ఆడిన సంజూ శాంసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

