epaper
Sunday, March 1, 2026
epaper

పురుగుల అన్నం.. నీళ్ల పప్పు: విద్యార్థుల నిరసన

కలం, వెబ్ డెస్క్​ : మంచిర్యాల (Mancherial) జిల్లా సాయికుంటలోని బీసీ ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హాస్టల్‌లో తమకు వడ్డిస్తున్న ఆహారం ఏమాత్రం నాణ్యతగా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నంలో పురుగులు, రాళ్లు వస్తున్నాయని, పప్పు నీళ్లలా ఉంటోందని విద్యార్థులు నిరసన తెలిపారు.

వార్డెన్ తమతో బలవంతంగా వంట పనులు చేయిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. హాస్టల్ ప్రాంగణం అంతా అపరిశుభ్రంగా ఉండటం, కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల తరచూ అనారోగ్యం పాలవుతున్నామని వారు వాపోయారు. అధికారుల పర్యవేక్షణ కరువైందని, తమ సమస్యలను పరిష్కరించి మెరుగైన వసతులు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!