epaper
Sunday, March 1, 2026
epaper

వేట్లపాలెం దుర్ఘటన కలచివేసింది : ప్రధాని మోదీ

కలం, వెబ్​ డెస్క్​:  ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడ జిల్లా సామర్లకోట (Samarlakota) మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 20 మందికిపైగా కార్మికులు దుర్మరణం పాలవ్వగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్న ప్రధాని మోదీ.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ కష్టకాలంలో బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చనిపోయినవాళ్లకు ఒక్కొక్కరికి రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!