epaper
Sunday, March 1, 2026
epaper

మరోసారి వివాదంలో ధోనీ.. జార్ఖండ్​ ప్రభుత్వం నోటీస్​​

కలం, వెబ్​ డెస్క్​: ఆటకు వీడ్కోలు చెప్పాక తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న టీమిండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర ధోని (MS Dhoni) మరోసారి ఇదే విధంగా వార్తల్లోకి ఎక్కారు. ప్రభుత్వం ఆయనకు కేటాయించిన స్థలాన్ని ఇంటి కోసం కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య ప్రయోజనాలకు వాడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో జార్ఖండ్​ రాష్ట్ర హౌసింగ్​ బోర్డ్​ నోటీస్​ జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

హౌసింగ్​ బోర్డు ప్రకటన ప్రకారం.. ధోనికి రాంచీలో కేటాయించిన స్థలం కేవలం ఇంటి కోసం మాత్రమే ఇచ్చింది. దానిని ఇతరత్రా అవసరాలకు వాడుకోవద్దు. అయితే, ప్రస్తుతం ఆ స్థలం కమర్షియల్​ అవసరాలకు వాడుతున్నట్లు హౌసింగ్ బోర్డు గుర్తించింది. దీంతో ధోనీకి నోటీస్​ ఇచ్చింది.

ఈ విషయంపై జార్ఖండ్​ స్టేట్​ హౌసింగ్​ బోర్డ్​ చైర్మన్​ సంజయ్​ లాల్​ పస్వాన్​ మాట్లాడుతూ.. ‘టీమిండియా మాజీ కెప్టెన్​, క్రికెటర్​ మహేంద్ర సింగ్​ ధోనికి(MS Dhoni) కేటాయించిన హౌసింగ్​ ప్లాట్​ను వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు తేలింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఆయనకు నోటీసులు జారీ చేశాం’ అని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!