కలం, వెబ్ డెస్క్: లిక్కర్ స్కామ్ కేసులో కవితకు (Kavitha) క్లీన్చిట్ రావడంతో జాగృతి కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో హరీశ్ రావు (Harish Rao) వర్గీయులు కవితకు వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారని కవిత వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం హరీశ్ రావు మీద విమర్శలు ఎక్కుపెట్టారు. అప్పటి నుంచి హరీశ్‌రావు అభిమానులు, కొందరు బీఆర్ఎస్ లీడర్లు బహిరంగంగానే కవితపై విమర్శలు గుప్పిస్తున్నారు. హరీశ్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
‘మూసిరెడ్డితో, బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని సొంత తండ్రిపైన, గత ప్రభుత్వంపైన విమర్శలు చేసిందే లిక్కర్ కేసు నుంచి బయటపడడానికి. వినేటోడు చెమిటోడు అయితే విశ్వం మొత్తం తిరిగి కూడా నీతులు చెప్తారు లిక్కర్ బ్యాచ్’ అంటూ హరీశ్ రావు వర్గీయులు పెడుతున్నారంటూ.. ఆ వాట్సాప్ ఇమేజ్‌లను జాగృతి సోషల్ మీడియా టీమ్ బహిర్గతపరిచింది. రేవంత్ రెడ్డి, బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే కవితకు (Kavitha) క్లీన్చిట్ దక్కిందని హరీశ్ రావు అభిమానులు దుష్ప్రచారం చేస్తున్నారని జాగృతి అభిమానులు మండిపడుతున్నారు.
KavithaRead Also : సచివాలయానికి మావోయిస్టు అగ్రనేతలు : సీఎంతో కీలక భేటీ !
Follow Us On: Instagram


