కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని చుంచుపల్లి (Chunchupalli) మండలంలో గురువారం 400 కేజీల గంజాయి లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ పట్టుబడింది. కొత్తగూడెంలోని చుంచుపల్లి మండలంలో పోలీసులు రొటీన్ చెక్ అప్‌లో భాగంగా వాహన తనిఖీలు చేస్తుండగా, అనుమానం వచ్చి ఒక కంటైనర్‌ను పట్టుకోవడం జరిగింది. అనూహ్యంగా అందులో దాదాపు 400 కేజీల గంజాయి కొబ్బరి పీచు మధ్యలో ఉండడం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. గంజాయి విలువ రూ. 2 కోట్ల వరకూ ఉండొచ్చని పోలీసులు చెప్తున్నారు. కాగా ఈ గంజాయిని చింతూరు నుంచి తరలిస్తున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది.
సంతోష్ సూర్య వంశీ, మహమ్మద్ ఉమర్, డెబ్రాత్ చక్రవర్తి, నాగ రత్తం అనే నలుగురు నిందితులను పోలీసుల అరెస్ట్ చేశారు. వీరితో పాటు గంజాయి కంటైనర్, ఒక బైక్, నాలుగు ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ 2025 జనవరి నుంచి ఇప్పటి వరకూ 84 గంజాయి కేసులలో 33 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు.
Read Also : మరో మల్టీస్టారర్ మూవీ ప్రకటించిన అనిల్ రావిపూడి..
Follow Us On: Instagram

