కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రతినిధులకు క్రీడా పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు (Raghu Rama Krishna Raju) క్రికెట్ ఆడుతూ కిందపడ్డారు. రన్స్ చేస్తూ పరుగెత్తుతుండగా ఆయన ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అధికారులు, తోటి ఎమ్మెల్యేలు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆయనకు పరీక్షించిన వైద్యులు భుజానికి గాయమైనట్లు వెల్లడించారు. రఘురామ ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఆయన బాగానే ఉన్నారని అధికారులు తెలిపారు.
Read Also: ఇన్స్టాలో మోదీ రికార్డ్.. ప్రపంచ రాజకీయ నేతల్లో అగ్రస్థానం
Follow Us On: X(Twitter)

